పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0052-3 లలిత సంపుటం: 06-063

పల్లవి:

బాలుండై రేపల్లె లోపల
నాలరియాటలె యాడెనే యితఁడు

చ. 1:

నెలఁతల సన్నపు నెన్నుదుళ్లపై
నెలయింతలరతి నిలు గట్టి
కెలపుల నును జంకెనలనె కలయుచు
నలరి బొమ్మ పెండ్లాడెనె యితఁడు

చ. 2:

గుబ్బల మెఱుఁగుల గురుగులలోపల
నుబ్బనానఁబాలొగి నించి
ఒబ్బిడి గాఁ బెదవులనే నమలుచు
నబ్బిన యాటలె యాడెనే యితఁడు

చ. 3:

ఎప్పుడు నిటువలె నిండ్లు గట్టుక
కప్పుర గందులఁ గలయుచునూ
తెప్పలఁ దేలుచుఁ దిరువేంకటగిరి
యప్పఁడు మహిమల నాడెనె యితఁడు