పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0052-2 ఆహిరి సంపుటం: 06-062

పల్లవి:

ఎటువంటి బిడ్డండె యితఁడు
ఇటువంటి వయసుననె యిట్లఁజేసీని

చ. 1:

నడుఁక కెటు నీటిలోననె యీఁదులాడేని
తడవి పట్టెదమనిన దాఁగిపోయీని
తడఁబడక నేలగుంతలువోవఁ దవ్వీని
కడపమిఁదనె వుండి కదలఁడెప్పుడును

చ. 2:

కలిమిలే మెఱుంగఁడిదె కల వెల్ల నడిగీని
చలమ రెవ్వరినైనఁ జావ నడిచీని
అలయ కడవులవెంట నాటలకే తిరిగీని
తొలఁగకిటు గిరులెక్కి దుముకు లాడీని

చ. 3:

విచ్చన విడినె తడువు విడిచి పారెడిని
రచ్చలనె యింత గుఱ్ఱము వంటికొడుకు
దిచ్చరీఁడై యిట్లు దిరువేంకటేశ్వరుండు
నిచ్చ నిచ్చలును గడుఁబెచ్చు వెరిగీని