పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0052-1 శుద్దదేశి సంపుటం: 06-061

పల్లవి:

వెన్నెలల బయట వేడుకకాఁడ
యిన్నే సిలాగుల నెలయించితిగా వోరి

చ. 1:

నగుతానె సారెసారె నాతో నీవింతేసి
పగటులు నెరుపేవు బాపురా
తెగి నిన్నుఁ జూడలేను తెమలకుండఁగలేను
సగము బీరము నాపైఁ జల్లితిగావోరి

చ. 2:

నయమున నిట్లనె నన్నుఁ గడుఁ గరఁగించి
బయ లీఁదించం జూచేవు బాపురా
నియమించలేను నిన్ను నిమిష మెడయలేను
ప్రియము భయము నాపైఁ బెట్టితిగా వోరి

చ. 3:

తక్కులనే పెట్టి పెట్టి తనివి దీరని నీ
పక్కబాయ నియ్యవైతి బాపురా
చక్కని వేంకటగిరిస్వామి నీపాదాలకే
మొక్కఁగానే యింపులు ముంచితిగావోరి