పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0051-6 రామక్రియ సంపుటం: 06-060

పల్లవి:

బిడ్డఁ డంటా నమ్మి యెట్టు వెట్టుకొన్నా రిందుకంటె
గొడ్డువో మేలు యిట్టి కొత్త లెందుఁగలవా

చ. 1:

నోరినిండాఁ జన్ను లేక నొగిలెడిఁ బాప మయ్యో
ఊరివారిపాపఁ డఁటా నొకయింతి
నేరుపునం జన్నియ్యంగ‌ నెత్తు రెల్లఁ దాగి తాగి
గోరపెట్టి చంపె నిట్టి కొత్త లెందుఁగలవా

చ. 2:

ఎత్తుకొనేవారు లేక యేఁకరే నటంచు నొక్కఁ
డెత్తుకొని వేడుకతో నేఁగఁగానే
బత్తిగలవానివలె ప్రాణము వోయినదాఁకా
కుత్తుక బిగించె నిట్టి కొత్త లెందుఁగలవా

చ. 3:

నిప్పు వలె నెండగాయ నీడలే దటంచుబండి
యొప్పుగం జాటిడి తనకుండంగానే
అప్పుడు వేంకటరాయఁ డడ్డపాపఁ డరకాల
కుప్పవడఁ దన్నె నిట్టి కొత్త లెందుఁగలవా