పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0051-5 ముఖారి సంపుటం: 06-059

పల్లవి:

ఏడకేడ యెంతకెంత యెక్కడికి నెక్కడ నీ
తోడ నలుగఁగ నంత దొడ్డదాననా

చ. 1:

నాకు నీకు నేమి వోదు నాఁడె నాఁటి కాయెఁబోయె
పోకుమంటా నాఁగేవు పొద్దువోదా
పైకొన చుట్టఱికానం బగ సాధించఁగ నీకు
లోకము లోపలను మెలుంతలు లేరా

చ. 2:

నన్ను నేల చెనకేవు నా తెరువు నీకునేల
నున్నట్ల చక్కఁజాడ నుండరాదా
కన్నుల లేనగవుల కసరుల జంకెనల
సన్నలఁదిట్టఁగ నే నీ సరిదాననా

చ. 3:

నాదెస యేమి చూచేవు నమ్మిక బాసలె చాలు
సేద దేర నేమైనాఁ జేయరాదా
ఆదరించి నన్ను వేంకటాద్రీశ కూడితివి
కాదన నీకంటె నేఁ జక్కని దాననా