పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0051-4 సామంతం సంపుటం: 06-058

పల్లవి:

యెన్ని మారులు యిట్టె నీపనులు
ఇన్ని మాయలు నన్ను నేఁచనేఁటికిరా

చ. 1:

నీళ్లే నమలేవు నీలోనె సన్నల
వేళ్లే చూపేవు వెలుపలికి
పేళ్లె తప్పేవు బిరుసుగ నింతేసి
గోళ్ల రాచేవు కోపమేఁటికిరా

చ. 2:

మేనె దాఁచేవు మెస్తిర గొడ్డలి
నానం బెట్టేవు నయముననే
పోని తెరువుల పోకులఁ బోయేవు
కానిరా యేటివంకలు తిద్దవశమా

చ. 3:

చేరి కపటాలె చేసేవు యిఁకనైనా
సారెం బరువులు చాలించరా
ధీరుండవుగాన తిరువేంకటపతి
కూరి మెఱిఁగి నన్నుఁ గడితి విపుడూ