పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0051-3 నాదరామక్రియ సంపుటం: 06-057

పల్లవి:

మనములోని విభుఁడు మఱవఁడే కాలంబు
నినుఁగలయునున్నాఁడు నీకేలె వెఱవ

చ. 1:

నెలనాళ్లవాఁ డొకఁడు నిర్మలంబైన రె
న్నెలలవాఁ డొకఁడు మూన్నెలలవాఁ డొకఁడు
నెలలు పండ్రెండైన నిజబాలుఁ డొక్కండు
నెలఁత యింతటి పనికె నీకేలె వెఱవ

చ. 2:

ప్రొద్దుపొడుపుల దొకటి ప్రొద్దు గ్రుంకుల దొకటి
ప్రొద్దువ్రొద్దులకు రహిపొయ్యేటి దొకటి
పొద్దెఱింగిన దొకటి పొద్దెఱుంగని దొకటి
నిద్దంపుఁ బువ్వులకు నీకేలె వెఱవ

చ. 3:

నిండుఁ జంచల మొకటి నిమిషమాత్రము దొకటి
వుండి నట్లనె వుండి వుడి వోపునొకటి‌
కొండలలో నెలకొన్న కోనేటిరాయండు నీ
నిండుఁ గౌఁగిటఁ గూడె నీ కేలె వెఱవ