పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0051-11 శుద్దవసంతం సంపుటం: 06-055

పల్లవి:

లోనివారి మొఱఁగేటి లోకదొంగవు కనిం
గాననట్టె రాకు మామంగారు వినేరు

చ. 1:

వడికి రేయివచ్చి నాతోడనే కడు
వెడమాటలాడేవు వేసదారివి
కడఁగి యిందాఁకాఁ నెక్కడనుంటివో మాట
కడునాడకుర మామంగారు వినేరు

చ. 2:

తొట్టెల పాపఁడ వింతె తొడ్డవాఁడవూ చల
పట్టి నాతొడలమీఁదఁ బవ్వళించేవు
పట్టకుర నాచెలఁగు బలిమీ నీవు మొల
కట్టురవములు మామంగారు వినేరు

చ. 3:

పగ సాధించ వచ్చిన పంతగాఁడవూ ఈ
వగఁబట్టి మంచ మెక్కి వానిఁ జూసేవూ
నగకురా వేంకటనాథ నీవు మేను
గగురు పొడిచి మామంగారు వినేరు