పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0050-6 శ్రీరాగం సంపుటం: 06-054

పల్లవి:

మగవాఁడు మాయకాఁడు యీ
జగడంపుం జనవులు సతములౌనాయమ్మ

చ. 1:

నిండిన నీమది నాతఁడు నిజముగ
నుండంగానే ఉడికే వేలె
అండల యాసల నాఁకలా యిటువంటి
యెండ చూపులను దప్పులేల తీరునోయమ్మ

చ. 2:

మందపు నవ్వుల నాతఁడు మాటలు
చిందంగానే చిమిడే వేలె
అందియు నందని యాసల నిటువంటి
చందమామగుటకలు సతము లవునా యమ్మ

చ. 3:

కలికి వేంకటరాయఁడూ కౌఁగిట
నలరంగానే అలసేవేలె
చెలువఁ డాతతి చేఁతల నిటువంటి
తొలు మించు మెఱుఁగులు తొడవులౌనాయమ్మ