పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0050-3 పాడి సంపుటం: 06-051

పల్లవి:

రమ్మనవే మాని రచనలు తా
నెమ్మదిఁ గూడిన నేఁడే రేపు

చ. 1:

నల్లని మేనికేలే నడురేయి తన
తెల్లని కన్నులకేలే తెల్లవాఱను
కల్లజంపులు సేసి కాఁకలఁ దా
బల్లిదుండై తేఁ బగలే రేయి

చ. 3:

సిగ్గుల మోము కేలే చిఱునవ్వు తన
నిగ్గుల చూపులకేలే నెరసులు
దగ్గఱి యింకా నేలే తమకము తా
వెగ్గలము వలచిన వెలియే లోను

చ. 3:

తావులమేనికేలే తాపము తన
కావులకన్నుల కేలే కనరులు
శ్రీవేంకటపతి చెలువుండిట్లే
కావలె నంటే కడయే నడుము