పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0050-2 ముఖారి సంపుటం: 06-050

పల్లవి:

కొమ్మమనసు దెలియరాదు కోర కలరఁగోనేటి
తిమ్మని తలంపులెల్లఁ దెలియ నెవ్వరివసమురా

చ. 1:

నిన్నుఁ దలఁచి పులకరించి నెలఁత చలి యటంచుఁజెలుల
కన్ను మొఱఁగి పయ్యద కొంగున కప్పు నొయ్యన దేహము
సన్నపుఁ జెమట నొసలఁ బొడమగన్నులు దేలగిలఁగఁజొక్కుచు
మిన్నక మదన మెత్తె ననుచు మెలుఁత తమ్ముల ముమియ

చ. 2:

వెక్కసమైన యూపుఁ గముల వెల్లువ లొయ్యన నిలిపి నిలిపి
పుక్కిట నించి గుబ్బలమీఁద పొలయఁ జెమట లార్చును
మిక్కటమైన కన్నులనీరు మెఱుఁగు రెప్పలతుదలనాన
చుక్కలం జూతమనుచు లేచి సుదతిమాయలు నేసును

చ. 3:

చెక్కిట నీవు సేసినముద్దుల చేఁతలు చెలుల కెల్ల మొఱఁగి
చెక్కునఁజెయి మోపుఁకొనుచు చెలియ యొయ్యనె గప్పుదు
యిక్కు వెఱింగి వేంకటాచలేంద్ర నీవు రమణిఁ గలసి
చొక్కపుఁజేఁతల నుల్ల మరసి చొక్కఁ జేసి తౌదురా