పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0050-1 ముఖారి సంపుటం: 06-049

పల్లవి:

ఏమి సోద్యం బిదియు నెన్న నాశ్చర్యంబు
కామాతురులకుఁ జీఁకటి వెన్నెలాయె

చ. 1:

ధవళమగుకలుహారదళ నఖంబులచేత
యువతి కుచగిరులఁజంద్రోదయం బాయె
తివిరి ముఖచందురుని తెలివి యౌవనసుధా
ర్ణవమునకు సురతమధనంబు ఘనమాయె

చ. 2:

తొడరి నవఘమ బిందువుల వానలు గురియుఁ
గడఁగి కచనీల మేఘము గారుక్రమ్మె
విడువ కిటుసంతసపు వెల్లి పై పై నిగుడ
కడిది నిట్టూపుఁ సురగాలి వీతెంచె

చ. 3:

తలకొన్న సాత్త్వికోదయముచేఁ బరవశం
బలమి సౌఖ్యములు దెలివి పడదాయె
వలచి తిరువెంకటేశ్వరునిం బొందిన మరుని
తలఁపు లన్నియును ముందర వెనుక లాయె