పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0048-2 శ్రీరాగం సంపుటం: 06-038

పల్లవి:

తనివి దీరక నన్ను తమకమున నెంతేని
చెనకేవు వద్దు నీ చిత్తమిఁక నోరి

చ. 1:

దంటవై నాచేతఁ దలఁపించు కొనఁగ దొర
కొంటి వింక నిది నీకు కొలఁదిఁ బడునా
నంటున నా ప్రియము నాఁటిలను నిన్నునా
వెంట ద్రిప్పక నిన్ను విడుతునా వోరి

చ. 2:

గబ్బివై నావాలుఁ గనుఁగొనల నవ్వులకు
నుబ్బేవు నీవు నీ వొడఁబడికల
నిబ్బరపు నావలపు నెలకొన్న యపుడేని
అబ్బురంబగు గర్వమణఁచనా వోరి

చ. 3:

మెట్టుకొని నీవు నామెఱుఁగుఁ బయ్యద చెఱఁగు
పట్టేవు నీకు నీపరిణామమా
దిట్టవై కూడితివి తిరువేంకటేశ్వరుఁడ
యిట్టట్టు నిన్నుఁ బోనిత్తునా వోరి