పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0047-4 ముఖారి సంపుటం: 06-034

పల్లవి:

చూపు లోపలి చూపు చూడకుర వోరి నీ
పైపూఁత చూపులకుఁ బాలైతి మోరి

చ. 1:

తనువెల్లఁ గడువేఁడి దగ్గరకు రోరి నీ
యనుభవనచేఁ దమక మారదా వోరి
వెన్నుకొన్న నిట్టూర్చు విడువవలె నోరి నీ
మనసు మదనానలము మానదా వోరి

చ. 2:

ఉదుటైన కళలతో నున్నాఁడవోరి నినుఁ
గదియఁ జూచిన యింతి కలికిరా వోరి
వెదచల్లు నగవులకు వెరతుమిదె వోరి రతి
సదమదము కాటింత చాలదా వోరి

చ. 3:

వేవేలు సతులతో విహరింతు వోరినేఁడు
రావలసి నీ కింద్దురాఁ దీరెనా వోరి
ఆవేళలా మమతలవి యెఱుంగుదొరి నీకు
శ్రీవేంకటేశ్వరుఁడ చెల్లురా వోరి