పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0046-6 భైరవి సంపుటం: 06-030

పల్లవి:

ఎంత సేసెఁబో దైవ మింతలోన నయ్యో
సంతపాకలంజవలె చల్లుఁ జూపు లేఁటికి

చ. 1:

తల్లులు బిడ్డలు మందలలోన నిందఱును
చల్లలమ్మే చేసేరు సంసారాలు
చెల్లఁబో నీ వుంగరాల చేతుల గోళ్లువెంచి
గొల్లదానవై యింత కొప్పువెట్ట నేఁటికి

చ. 2:

ఎడ్డెలైన వారిఁ జూచి యిట్టిమన్న కులమని
సడ్డ సేయరిందఱును జరయఁగాను
ఒడ్డుఁ బొడవగు గుబ్బ లొరయుచుఁ గానరాఁగా
దొడ్డవారికిఁ బయ్యద తూల నింత యేఁటికి

చ. 3:

ముంగిట నిధానములు ములుగంగ సొమ్ములతో
సంగడి గొల్లెతలెల్ల జడియఁగాను
అంగడివేంకటపతి నలమి పుట్టుక నీవు
చెంగలించి సొమ్ము గాఁగఁ జేసుకొంటి వేఁటికి