పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0046-3 సామంతం సంపుటం: 06-027

పల్లవి:

తార వలచినయపుడె తరుణిరతుల
తారసము లెట్లుండు తగవు లెట్లుండు

చ. 1:

తరితీపు లెట్లుండు తాలుము లెట్లుండు
గరువంబు లెట్లుండు కసరు లెట్లుండు
పొరపొచ్చె మెట్లుండు పొలయలుక లెట్లుండు
నెరవరిక లెట్లుండు నెఱుక లెట్లుండు

చ. 2:

ఓపికలు నెట్లుండు నొల్లములు నెట్లుండు
చూపోప మెట్లుండు సొలపు లెట్లుండు
దాఁపరము లెట్లుండు తగుమాన మెట్లుండు
కోపంబు లెట్లుండు కొఱఁత లెట్లుండు

చ. 3:

సిరిదొలఁకు లెట్లుండు శేషాద్రిపతికరుణ
కిరవైన సతి మనసు నెపుడు నెట్లుం
మురిపమది యెట్లుండు ముద్దుఁజనుగవమీద
నరచందురుని రేక లపుడెట్టులుండు