పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0044-3 ఆహిరి సంపుటం: 06-015

పల్లవి:

పచ్చి కస్తురి నీకు బ్రాఁతిగాని
ఒచ్చెమని పూయ నొల్లమి దెన్నఁడును

చ. 1:

తట్టుపునుఁ గొడల నంతటా నలంది
దిట్టవై పరిమళానఁ దిరిగేవు
ఇట్టిది మాయడవిలో నింతా నిదే
ఒట్టి యుండు నే మొల్ల మిదెన్నఁడును

చ. 2:

కప్పురపుఁ దావి తోడఁ గదియుచు
చిప్పిలెటి చెమటలఁ జెలంగేవు
తప్పక యింటింట దీని తరువులే నే
మెప్పుడు మాచేత నంట మిదెన్నఁడును

చ. 3:

జవ్వాది శిరసు నిండఁ జమరుకా యిట్టె
పవ్వళించే విదె నాపక్కనీవు
రవ్వయిన వేంకటరమణుఁడా మే
మెవ్వరమూ దీని నెఱుఁగ మెన్నఁడును