పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0044-2 ఆహిరి సంపుటం: 06-014

పల్లవి:

తొడరు నటువలెనే దొర కోపము
అడియాలమిటు సేసె నబ్బెఁగా బలిమి

చ. 1:

తనుఁబాసినంతనే తరుణిఁ గడునేఁపెనని
వనజారి మీఁదఁ బ్రియవరుఁడు గూడి
కనలి కొనగోళ్లఁ దునుక లుసేసి జవరాలి
చను జక్కవలకొసగెఁ జాలదా బలిమి

చ. 2:

కలికి కోమలికి చిలుకలు గండుఁ గోవిలలు
పలుకులనె వేఁచెనని ప్రాణ విభుండు
కెలపుఁ బలుకుల సన్నగిలఁ జేసి యలబలము
తలిరు మోవినె యేఁచె దక్కెఁగా బలిమి

చ. 3:

మతినుండి చిత్తజుఁడు మగువ గారించెనని
పతి వేంకటేశ్వరుఁడు పడతిఁ గదిసి
ప్రతిలేని మనసెల్లఁ బరవశము చేసి మరు
నతివ కన్నుల నించె నదియపో బలిమి