పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0043-5 సామంతం సంపుటం: 06-011

పల్లవి:

చెలిదా మతి నీచెఱగాక
తలఁపగ నీకిది తగులైపోయె

చ. 1:

తరుణీమణివా తమ్మికన్ను లివి
అరయ నెపుడు నీయవె కాక
నిరతపుఁజూపులు నీచెలువమునకే
యిరవై వనితకు నెరవైపోయె

చ. 2:

మెలుఁతది గా దీమే నిటుకాఁకల
కలవఱచిన నీయదే కాక
పులకజొంపములఁ బ్రుంగు డగుచు నీ
యలుకల చెమటల కమ్ముడొవోయె

చ. 3:

పంకజముఖివా బలుపుఁ గుచములు న
ఖాంకరుచుల నీయవే కాక
వేంకటేశ నీ వేడుక కౌఁగిట
నంకురించె నీవవునోకావో