పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦96-02 శంకరాభరణం సం: 01-478 గోవిందరాజు


పల్లవి:
ఆలవటపత్రశాయివైనరూప మిట్టిదని
కొలువై పొ డచుపేవా గోవిందరాజా

చ.1:
పడఁతులిద్దరిమీద బాదములు చాఁచుకొని
వొడికపు రాజసాన నొత్తగిలి
కడలేని జనాభికమలమున బ్రహ్మను
కొడుకుఁగా గంటి విదె గోవిందరాజా

చ.2:
సిరులసామ్ములతోడ శేషునిపైఁ బవళించి
సారిది దాసులఁ గృపఁ జూచుకొంటాను
పరగుదైత్యులమీఁద పామువిషములే నీవు
కురియించితివిగా గోవిందరాజా

చ.3:
శంకుఁజక్రములతోడఁ జాఁచినకరముతోడ
అంకెల శిరసు కింది హస్తముతోడ
తెంకిన శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో
కొంకక వరములిచ్చే గోవిందరాజా