పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦96-౦1 నాట సం; 01-477 రామ


పల్లవి:
ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని
విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని

చ.1:
యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు
కందువ రాఘవుఁడు ఖండించునాఁడు
ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచెే
గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు

చ.2:
యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి
వేడుకతో హరివిల్లు విఱిచేనాఁడు
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు
కూడ బట్టి సంజీవికొండ దెచ్చేనాఁడు

చ.3:
జముఁ డెక్కడికిఁ బోయ సరయువులో మోక్ష-
మమర జీవుల కిచ్చె నల్లనాఁడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లెరి
తిమిరి శ్రీవేంకటపతికి నేఁడు నాఁడు