పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రెకు:0౦94-05 గుండక్రియ సం: 01-469 వైరాగ్య చింత


పల్లవి:
ముందటిజన్మములెల్లా ముంచెఁ బారుబడివడ్ణి
యెందు చొచ్చినానుఁ బోనియ్య దీరుణము

చ.1:
నుదుట వ్రాసినవ్రాలు నూరేండ్లపత్రము
పాదలు నాకర్మమే పూఁటకాఁపు
వెదకి సంసారము వెంటఁ బైతరవు
యిది యెందుచొచ్చినాఁ బోనియ్య దీరుణము

చ.2:
పుట్టినప్పుడే తనువు భోగ్యమై నిలిచెను
జట్టిఁ గామినులపొందు సరియాఁకలు
నెట్టన యాహరములు నిచ్చినిచ్చ లంచాలు
దిట్టనై యెందు చొచ్చినాఁ దీర దీరుణము

చ.3:
యెక్కువైనశ్రీవేంకటేశుమఱఁగు చొచ్చి
తెక్కుతోడ సలిగెల దిరుగఁగను
అక్కరతో నప్పులెల్లా నవి మాకుఁ దామచ్చి
చిక్కి యెందు చొచ్చినాఁ జేరు నీరుణము