పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు:౦080-05 బౌళి సం: 01-386 వైష్ణవ భక్తి


పల్లవి:
అన్నిటా నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను
యెన్నఁగ నీవొక్కఁడవే గతియని యెంచికొలుచుటే ప్రపన్నసంగతి

చ.1:
యేకాంతంబున నుండినపతిని యెనసిరమించుటే సతిధర్మంబు
లోకమురచ్చలోనుండినపతి లోఁగొని పైకొని రానట్లు
యీ కొలఁదులనే సర్వదేవతలయిన్ని రూపులై నీ వున్నప్పుడు
కై కొని నిను బహుముఖములఁగొలుచుట గాదు పతివ్రత వ్రత ధర్మంబు

చ.2:
పూనిన బ్రాహ్మణుల లోపలనే నినుఁ బూజించుట వేదోక్తధర్మము
శ్వానకుక్కుటాదులోపల నిను సరిఁ బూజించఁగరానట్లు,
యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీశరణాగత జనులను
కానక, వొక్కట సరిగాఁజూచుట కాదఁ వివేకధర్మంబు

చ.3:
శ్రీ వేంకటపతిగురువనుమతినే నేవే నాకును శిష్యధర్మము
ఆవలనీవల నితరమార్గములు యాత్మలోన రుచిగానట్లు
భావింపఁగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము
కైవశమై యిన్నిటా వెనుతగులు కాదవివేకధర్మంబు