పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0080-06 ఆహిరి సం: 01-387 అధ్యాత్మ


పల్లవి:
కోరు వంచరో కోటారు
ఆరసి మనసా అంతరాత్మకు

చ.1:
కొండలపొడవులు కోరికకుప్పలు
పండినపంటలు భవము లివి
నిండినరాసులు నిజకర్మంబులు
అండనె యివె మాయారంభములు

చ.2:
వెలిధాన్యంబులు విషయపురాసులు
పాలివారేటివూరుపుగములు
కలుషపుమదమున కావుగప్పినవి
అలవిమీర మాయారంభములు

చ.3:
బడి నింద్రియములబంతులు నురిపి
కడురతుల దండగట్టలతో
యెడనెడ శ్రీవేంకటేశుమహిమ లవే
ఆడియాలపుమాయారంభములు