పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0080-04 పాడి సం; 0౦1-385 భగవద్గీత కీర్తనలు


పల్లవి:
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీరఘురామా

చ.1:
కులమును నీవే గోవిందుఁడా నా-
కలిమియు నీవే కరుణానిధి,
తలఁపును నీవే ధరణీధరా ,నా-
నెలవును నీవే నీరజనాభా

చ.2:
తనువును నీవే దామోదరా, నా-
మనికియు నీవే మధుసూదనా
వినికియు నీవే విట్టలుఁడా,నా-
వెనకముందు నీవే విష్ణుదేవుఁడా

చ.3:
పుట్టుగు నీవే పురుషొత్తమా కొన
నట్ట నడుము నీవే నారాయణా,
యిట్టి శ్రీవేంకటేశ్వరుఁడా నాకు
నెట్టన గతి యింక నీవే నీవే