పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0080-03 బౌళి సం: 01-384 శరణాగతి


పల్లవి:
కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు
యిందరిలోపల నీవెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా

చ.1:
దూరము కర్మమునకు జ్ఞానము తోడనే వొండకటికిని
దూరము పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు;
దూరము విరతికి సంసారము; తుదమొదలే లేదు;
యీరీతుల నీ వెడమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా

చ.2:
కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం; బెన్నఁడును
కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను;
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన;
యేడ గొలఁదిగా శ్రీహరిమాయలు యేగతిఁ దెలిసెద నేనయ్యా

చ.3:
శ్రీ వేంకటపతి నన్నీ గతిఁ జిక్కించితి వీజగమునను;
భావింపఁగరాదు నీమహిమ బహుముఖములయర్దముగాన,;
యేవిధమును నేఁటికి నాకిఁక యెందెందని తగిలెద నేను
దైవికమగు నీదాసానుదాస్యము దక్కినదే నాకు