పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0080-02 పాడి సం: 01-383 శరణాగతి


పల్లవి:
అభయమభయమో హరి నీకు
విభుఁడ వింతటికి వెర విఁక నేది

చ.1:
జడిగొని మదిలో శాంతము నిలువదు
కడుఁగడు దుస్సంగతి వలన
యిడుమలేని సుఖ మించుక గానము
అడియాసల నా యలమటవలన

చ.2:
తలఁపులోన నీతత్వము నిలువదు
పలు లంపటముల భ్రమవలన
కలిగిన విజ్ఞాన గతియును దాఁగెను
వెలి విషయపు పిరివీకుల వలన

చ.3:
పక్కనఁ బాపపు బంధము లూడెను
చిక్కక నినుఁ దలఁచిన వలన
చిక్కులు వాసెను శ్రీవేంకటపతి
నిక్కము నా కిదె నీకృప వలన