పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦80-01 ఆహిరి సం: 01-382 వైరాగ్య చింత


పల్లవి:
దేవ నీమాయతిమిర మెట్టిదో నా-
భావము చూచి గొబ్బనఁ గానవే

చ.1:
వెడదుఃఖమపుడెల్లా వేరుచుండుదుఁగాని
తడవి విరతిఁబొంది తలఁగలేను
ఆడియాసలఁ దిరిగి అలుయుచుండుదుఁగాని
మడి దొసకుల నివి మానలేను

చ.2:
హేయము స్తీసుఖమని యెఱుఁగుచుండుదుఁగాని
పాయపుమదముచేతఁ బాయలేను
పాయనిపాపాలు చూచి భయమందుచుందుఁగాని
వోయయ్య యివి సేయకుండలేను

చ.3:
కలకాల మిన్నియును గందు విందుఁగాని మఱి
యెలమి నొక్కటనైన యెచ్చరలేను
బలిమి శ్రీవేంకటేశ బంధముక్తునిఁజేసి
తలఁపులో నెలకొని దయఁజూడవయ్యా