పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: ౦౦69-౦4 బౌళి సం; 01-361 వైరాగ్య చింత


పల్లవి:
ఎక్కడ చొచ్చడి దీభవమేదియుఁ గడపల గానము
వుక్కునఁ బరితాపానల మూదక మండెడివి

చ.1:
హృదయవికారము మాన్చఁగ నేతెరఁగును సమకూడదు
మదనానందము చెరుపఁగ మందేమియు లేదు
పాదలినదేహగుణంబులఁ బోనడువఁగ గతి గానము
బ్రదికించినకోరికెలకుఁ బ్రాయము దిరిగినది

చ.2:
కమలినయజ్ఞానం బిది కన్నులముందరఁ గానదు
తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు
తెమలనియాశాపాశము తెంపఁగ సత్వము చాలదు
మమకారము వెడలింపఁగ మతి యెప్పుడు లేదు

చ.3:
దురితంబులు పుణ్యంబులు తొడిఁబడ నాత్మనుఁ బెనగొని
జరగఁగ శరీరధారికి సత్కర్మము లేదు
తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదము
శరణని బ్రదుకుటదప్పను సన్మార్గము లేదు