పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0069-05 గుండక్రియ సం: 01-362 భక్తి


పల్లవి:
ప్రాణులనేరమి గాదిది బహుజన్మపరంపరచే
ప్రాణులు సేసిన తమతమ పాపఫలము గాని

చ.1:
హరి సకలవ్యాపకుఁడని అందరుఁ జెప్పఁగ నెరిఁగియు
పరదైవంబులఁ గొలువకపాయరు మానవులు
నరపతి భూమేలఁగ భూవరు భజియింపఁగనొల్లక
పరిసరవర్తులబెంబడిఁ బనిసేనినయట్లు

చ.2:
పొందుకు తమతమ సేసినపూజలు మ్రొక్కులు గైకొను
అందముగాఁ బురుషాత్తముఁ డాతఁడే కలఁడనియు
అందరు నెరిఁగియు యితరులఁ జెందుదురున్నత శైలము
నందక చేరునతరువుల నందుకొనినయట్లు

చ.3:
శ్రీ వేంకటపతి యొక్కఁడె చెప్పఁగ జగములకెల్లను
దైవము నాతుమలోపలిధనమనఁగా వినియు
సేవింపరు పామరు లీదేవుని మధురంబొల్లక
వావిరిఁ బులుసులు చేఁదులు వలెనని కొనునట్లు