పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0069-03 సామంత సం: 01-360 అథ్యాత్మ శృంగారము


పల్లవి:
ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటా
కొత్తసేఁతలెల్ల దొరకొంటిగా నీవు

చ.1:
హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన-
మైన పదవులఁ బెట్టేయెటువలెనే
మానక యెవ్వతెనైన మచ్చికఁ దగిలి నాతో .....
నానిపట్టి సరివేసే వద్దిరా నీవూ

చ.2:
కడుఁబాతకులు నిన్నుఁ గదిసి కొలిచేరంటా-
నడరి పుణ్యులఁజేయునటువలెనే
కడఁగి యెవ్వతెనైన గాజు మాణికము సేసి
వడి నన్ను గెరలించవద్దురా నీవూ

చ.3:
దిందుపడ మాయసేసి దేవుఁడ నేఁగానంటా....
నందరి భ్రమలఁ బెట్టునటువలెనే
అందమైనన తిరువేంకటాద్రీశ నీప్రేమ
చెంది నన్నుఁ గూడి దాఁచజెల్లునా నీవూ