పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0050-06 బౌలి సం: 01-309 అధ్యాత్మ


పల్లవి:
చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడో
వొత్తిన యీచేఁత లొకరివి గావు

చ.1:
పదిలమైన మోహపాశంబులు దెచ్చి
మెదలకుండఁగ నాకు మెడఁజుట్టి
యెదిరివారు నవ్వ నింటింటఁ దిరిగించి
తుదలేని యాసల దుఃఖాతురునిఁ జేసె

చ.2:
కొలఁదిమీఱ జన్మకోట్లఁ బెనగొని
తొలఁగని నాలోని దురితము
తొలఁగింప నాలుక తుదకు నీపేరిచ్చి
తెలుపు మింతియ చాలుఁ దిరువేంకటేశా