పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0050-05 శ్రీరాగం సం: 01-308 వైరాగ్య చింత


పల్లవి:
ఇదివో సంసారమెంత సుఖమో కాని
తుదలేని దుఃఖమను తొడవు గడియించె

చ.1:
పంచేద్రియంబులను పాతకులు దనుఁదెచ్చి
కొంచెపు సుఖంబునకుఁ గూర్చఁగాను
మించి కామంబనేడిమేఁటి తనయుండు జని-
యించి దురితధనమెల్ల గడియించె

చ.2:
పాయమనియెడి మహపాతకుఁడు తనుఁ దెచ్చి
మాయంపు సుఖమునకు మరుపఁగాను
సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ
బోయి యీనరకమనుపురము గడియించె

చ.3:
అతియుండగువేంకటాద్రిశుఁడను మహ-
హితుఁడు చిత్తములోన నెనయఁగాను
మతిలోపల విరక్తిమగువ జనియించి య-
ప్రతియయి మోక్షసంపదలు గడియించె