పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦50-04 కాంబోదిసం: 01-307 అధ్యాత్మ



పల్లవి:
శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి
దమము చాలనియట్టితగు లిదేమిటికి

చ.1:
పగయునుఁబోలె నాపై సేయునడియాస
తగిలి యేపనేకాని దయ గొంత లేదు
జగడముఁబోలె నలసతిలేనిమమత దను
తెగి వేాఁచనేకాని తీరుగడ లేదు

చ.2:
బుణమునుఁబోలె తీరియుఁదీరనది కర్మ
గణనగలకాలంబు కడ మొదలు లేదు
వ్రణమునుఁబోలె విడవక రాఁగ దేహజపు-
గుణము సౌఖ్యము తెరువు గొంతయును లేదు

చ.3:
నీతియుఁబోలెఁ బ్రాణికి వేంకటేశుకృప
చేతికి నిధానంబు చేరినట్లాయ
భూతములఁబోలె తలఁపున కితరసంస్మరణ-
భీతిపుట్టించి యప్రియభావమాయ