పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦50-03 బౌళి సం: 01-306 అధ్యాత్మ


పల్లవి:
ఇటువలెనేపో సకలము యించుకగన భావించిన
అటమటములసంతోషము ఆసలు సేయుటలు

చ.1:
పగగొనితిరిగేటిజన్మపుబాధలు తనకే కాలము
తగుసుఖ మెక్కడ నున్నది తడతాఁకులే కాక
పొగలోపల సేక గాసిన భగభగఁ గన్నుల నీళ్లు
నిడిగినదుఃఖమే కాకిటు నిజసౌఖ్యము గలదా

చ.2:
పాలసిన మాయపురూపులు పొలఁతుల మచ్చిక మాటలు
తలఁచిన తనకేమున్నది తలఁపోఁతలేకాక
బలువునఁ బారఁగ మోహవుపాశము తన మెడఁ దగిలిన
తలకిందుగఁ బడుటెల్లను తనకిది ప్రియమౌనా

చ.3:
చేతిపదార్థము దలఁచక చేరువనుండినవారల-
చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా
ఆతుమఁగల వేంకటపతి నాత్మఁ దలఁచి సుఖింపక
యేతరి సుఖములఁ దిరిగిన నింపులు దనకౌనా