పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦50-02 సామంతం సం; 0౦1-305 వైరాగ్య చింత


పల్లవి:
కాలము కాలము గాదు కపటాలే తఱచాయ
చాలునింక దీనితోడిజాలి మానరే

చ.1:
పిన్ననాట నుండి తనపెంచిన యీదేహము
మున్నిటివలెగాదు ముదిసీని
యెన్నికదినాలచేత నెప్పుడేడఁ బడునో
కన్నవారిచేతికి గక్కున నియ్యరే

చ.2:
తోలునెముకలచేత దొడ్జెన యాదేహము
గాలివేత దాలిమీఁదఁ గాగీని
కీలుగీలు యెప్పుడేడ కింద వీడిపడునో
మేలుఁగీడు లేనిచోట మేఁటిఁజేసి పెట్టరే

చ.3:
కింకపుకిసరుచేత కీడైన దేహము
వంకవంకతెరవుల వడీసీని
యింక నీవిధిచేత నెప్పుడేడఁ బడునో
వేంకటేశుఁజేరఁ బడవేయఁగదరే