పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0050-01 ముఖారిసం: 01-3౦4 అధ్యాత్మ


పల్లవి:
ఎఱుక గలుగునాఁ డెఱఁగఁడటా
మఱచినమేనితో మరి యఱిఁగీనా

చ.1:
పటువైభవములఁ బరగేటినాఁడే
తటుకున శ్రీహరిఁ దలఁచఁడటా
కుటిలదేహియై కుత్తికఁ బ్రాణము
తటతటన దరఁగఁ దలఁచీనా

చ.2:
ఆలుబిడ్డలతో మహసుఖ మందుచు
తాలిమితో హరిఁ దలఁచఁడటా
వాలిన కాలుని వసమైనప్పుడు
దాలు వెండఁగాఁ దలఁచీనా

చ.3:
కొఱఁతలేక తేఁకువఁ దా నుండేటి-
తఱి వేంకటపతిఁ దలఁచఁడటా
మఱులు దేహియై మఱిచివున్నయడ
తఱచుటూరుపులఁం దలఁచీనా