పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: ౦౦46-౦4 నాట సం: 01-283 వైరాగ్య చింత


పల్లవి:మానఁ డెన్నఁడు శరీరి దు-
        ర్మానబోధుతుఁడుగాన

చ.1:పంచభూతవికారంబులు
      పంచేంద్రియములూ
      పంచమహపాతకములకును
      పంచివేసినవిగాన

చ.2:తైగుణ్యవికారంబులు
      త్రైగుణ్యపుఁదనువులు
      శ్రీగురుఁడగుశ్రీవేంకటపత-
      భోగయోగ్యములుగాన