పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. రచనా వైశిష్ట్యం:

ఈ శతకం వెంగమాంబ ప్రథమ రచన అయినప్పటికీ, ఇందులో కమనీయమగు కవితా వైచిత్రికి కొదువ లేదు. బమ్మెర పోతనార్యుని భాగవతము, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకము, కంచెర్ల గోపనార్యుని దాశరథి శతకము-మున్నగు ప్రాచీన మహాకవుల రచనల ఛాయలు గోచరిస్తూవున్నాయి. అయినను, కొన్ని విశిష్ట గుణాలచే ఈ కృతి స్వతంత్రవ్యక్తిత్వం కలదై అలరారుతూవుంది.

ఆ విశిష్టగుణాలు ఇవి:

i) కవయిత్రి యీ కృతిలో ఇష్టదేవతా, గురువందనాదికం మొదలుకొని చివరిదాకా నిర్మల భక్తినిష్ఠమైన తన మనఃక్షేత్రంలో అంకురించిన భావాలనే సహజధోరణిలో సంతరించింది.

ii) ఈ శతకశైలి ఒడిదుడుకులు లేక, నిరాడంబరమై, నిర్మలంగా, నిరర్గళంగా సాగుతూ, అక్కడక్కడ పూర్వకవుల కవితారీతులను సముచితంగా సమన్వయించుకొని, ఒకానొక ప్రత్యేకతతో విలసిల్లుతూవుంది.

iii) అత్యంత సహజమైన భక్తిభావాలు, అనుభవజనితాలైన తాత్త్వికభావాలు ఇందులో పడుగుపేకలుగా అల్లుకొనివుండటం చేత, ఇది అపూర్వమైన "భక్తివేదాంత శతకం”గా విరాజిల్లుతూవుంది.

6. పరిష్కరణ:

ఈ శతకాన్ని తొలుత విశ్వవిఖ్యాత పరిశోధకాగ్రేసరులు కీ.శే. మానవల్లి రామకృష్ణకవి మహోదయులు తమకు లభించియుండిన ఒకతాళపత్ర ప్రతి ఆధారంతో పరిష్కరించి 1944లో తి.తి.దే. శ్రీ వేంకటేశ్వర