పుట:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

5 /6-457 'ప్లాంటేషను అధీక్షకుడు' అను పదబంధమునకు, మేనేజరు అని పిలువబడినను, అధీక్ష కుడు అని పిలువబడినను లేక మరే ఇతర పేరుతో పిలువబడినను, ప్లాంటేషనులో శ్రామికులయొక్కయు పనియొక్కయు బాధ్యతను లేక పర్యవేక్షణను వహించుచున్న వ్యక్తి, అని అర్ధము

10.(1) తాము పరిచర్యచేసిన లేక ఉండియున్న లేక విహితపరచిన ప్రాంతము లలో సంభవించిన ప్రతియొక జననమును లేక మరణమును లేక రెండింటిని విహితపరచి నట్టి సమయములోను అట్టి రీతిగను తెలియపరచుట ఈ క్రింద తెలిపిన వ్యక్తులకర్తవ్యమే. యుండును.: -

(i) జనన సమయమునగాని మరణ సమయమునగాని పరిచర్యచేసిన,మంత్ర సాని లేక ఎవరేని యితర వైద్య పరివారకుడు లేక ఆరోగ్య పరిచారకుడు

(ii) శవముల సంస్కారమునకై ప్రత్యేకించిన స్థానము యొక్క పాలకుడు,లేక సొంతదారు లేక అట్టి స్థానమునందు హాజరులోనుండవలసినదని ఒక స్థానిక ప్రాధికార సంస్థ కోరినట్టి ఎవరేని వ్యక్తి లేక

(iii) రాజ్య ప్రభుత్వము ఈ విషయమున పదాభిదానముతో నిర్దిష్టపరచునట్టి ఎవరేని ఇతర వ్యక్తి,

(2) ఏ ప్రాంతములోనైనను , ఈ విషయమున అందు లభ్యమగు సౌకర్యము లను దృష్టియందుంచుకొని, మరణ కారణమును గూర్చి, విహితపరచినట్టి వ్యక్తి, నుండియు మరియు అట్టి ప్రరూపములోను రిజిస్ట్రారు. ఒక ధ్రువపత్రమును పొంద వలెనని, రాజ్య ప్రభుత్వము కోరవచ్చును .

(3) మరణ కారణమును గూర్చి ధువపత్రమును (సర్బిఫికేటు) పొందవలెనని రాజ్య ప్రభుత్వము ఉప పరిచ్ఛేదము (2) క్రింద కోరినయెడల ఎవరేని మరణించిన వ్యక్తి కడపటిసారి అస్వస్థుడైనప్పుడు వైద్యవృత్తి దారుచే పరిచర్య పొందియుండిన సందర్భములో ఆ వ్యక్తి మరణించిన పిమ్మట, ఆ వైద్యవృత్తిదారు, తనకు తెలిసినంత వరకు తాను విశ్వసించుచున్న మేరకు మరణ కారణమును తెలుపుచు విహిత ప్రరూపములో ఒక ధ్రువపత్రమును ఎట్టి ఫీజును వసూలు చేయకుండ ఆ మరణమునకు సంబంధించిన సమాచారమును అందజేయుటకు ఈ చట్టము క్రింద కోరబడిన వ్యక్తికి వెంటనే జారీచేయవలెను. మరియు అట్టి వ్యక్తి, ఆ ద్రువపత్రమును పొంది, ఈ చట్టము కోరిన ప్రకారము ఆ మరణమును గూర్చిన సమాచారమును అందజేయునప్పుడు రిజిస్ట్రారుకు ఆ ధ్రువపత్రమును ఈయవలెను.

11. ఈ చట్టము క్రింద కోరినట్టి ఏదేని సమాచారమును రిజిస్ట్రారుకు వాగ్రూపముగా ఇచ్చునట్టి. ప్రతియొక వ్యక్తి. ఈ విషయమున నిర్వహించెడి రిజిస్టరులొ తన పేరు, వివరణ, నివాస స్థలము వ్రాయవలెను. అతడు వ్రాయలేనివాడై నయెడల ఆ వివరములను రిజిస్ట్రారు నమోదు చేయవలెను. మరియు ఆ వ్యక్తి ఆ రిజిస్టరులొ నమోదు చేసిన తన పేరుకు, వివరణకు, నివాస స్థలమునకు ఎదురుగా తన బొటన వేలి ముద్ర వేయవలెను.

12. జననము లేక మరణమును రిజిస్టరు చేయుట పూర్తి అయిన వెంటనే అట్టి జననము లేక మరణమునకు సంబంధించిన రిజిస్టరు నుండి విహితపరచిన వివరముల ఉదాహృతులను రిజిస్ట్రారు తన చేవ్రాలుచేసి, 8వ పరిచ్ఛేదము లేక 9వ పరిచ్ఛేదము క్రింద సమాచారము అందజేసిన వ్యక్తికి ఉచితముగా ఈయవలెను.

13. జననము లేక మరణమును రిజిస్టరు చేయుటకు నిర్దిష్టపరచిన కాలావధి ముగిసిన పిమ్మటను, అది సంభవించిన ముప్పది దినముల లోపలను రిజిస్ట్రారుకు తెలియపరచినట్టి ఏదేని జననము లేక మరణమును, విహితపరచినట్టి ఆలస్యపు ఫీజు చెల్లించిన మీదట రిజిస్టరు చేయు