పుట:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

4 /G--456 (ఏ) ఇందలి (బీ) నుండి (ఈ) వరకుగల ఖండములలో నిర్దేశించిన ఏదేని స్థలము కానట్టి గృహములోని జనన మరణముల విషయమున అది నివాస గృహమైనను, నివాసేతర గృహమైనను, ఆ గృహము యొక్క పెద్ద, లేక ఆ గృహములో ఒకటి కంటే ఎక్కువ కుటుంబములున్నయెడల ఆ కుటుంబ పెద్ద, అనగా ఆ గృహముచే లేక కుటుంబముచే పెద్దగా గుర్తింపుపొందిన వ్యక్తి, జననమును లేక మరణమును గూర్చి రిపోర్టు చేయవలసిన కాలావధిలోపల ఎప్పుడైనను అతడు గృహములో లేనియెడల, ఆ గృహములో నున్నట్టి ఆ పెద్ద యొక్క అత్యంత సన్నిహిత బంధువు, మరియు అట్టి ఏ వ్యక్తి యు లేనియెడల ఆ కాలావధిలో ఆ గృహములోనున్న అందరి కంటె వయసులో పెద్దవాడగు వయోజన పురుషుడు;

(బీ) ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రము, ప్రసూతి లేక నర్సింగుహోం లేక అటువంటి ఇతర సంస్థలోని జనన మరణముల విషయమున బాధ్యతగల అచటి వైద్యాధికారి లేక ఈ విషయమున అతనిచే ప్రాధికృతుడైన ఏ వ్యక్తి యైనను;

(సీ) జైలులోని జనన మరణముల విషయమున, ఆ జైలు బాధ్యతగల జైలరు;

(డీ) ఒక చౌట్రి, సత్రము , హాస్టలు , ధర్మశాల, భోజన గృహము, వసతి గృహము , పూటకూళ్ల యిల్లు, బారకాసు, కల్లు దుకాణము లేక సార్వజనిక సమాగమ స్థలములోని జనన మరణముల విషయమున, దాని బాధ్యతగల వ్యక్తి:

(ఈ) ఒక సార్వజనిక స్థలములో విడిచిపెట్టబడినట్లు కనుగొనబడిన అప్పుడే పుట్టిన శిశువు లేక ఏదేని శవము విషయమున గ్రామమై నచో, ఆ గ్రామము యుక్క గ్రామపెద్ద లేక ఇతర తత్సమానాధికారి, మరియు వేరొకచోట . అయినచో స్థానిక పోలీసు స్టేషను బాధ్యతగల అధికారి:

అయితే, అట్టి శిశువును లేక శవమును కనుగొనినట్టి లేక అట్టి శిశువు లేక శవము తన వశమునందు ఉంచబడినట్టి ఏ వ్యక్తి యైనను ఆ విషయమును గ్రామపెద్దకు లెక పైన చెప్పబడిన అధికారికి తెలియపరచవలెను.

(ఎఫ్) ఏదేని ఇతర స్థలములో, విహితపరచినట్టి వ్యక్తి

(2) ఉపపరిచ్ఛేదము (1)లో ఏమి ఉన్నప్పటికిని, ఒక రిజిస్ట్రీకరణ డివిజనులో ఉన్నట్టి పరిస్థితులను దృష్టియందుంచుకొని, రాజ్య ప్రభుత్వము ఉత్తరువు ద్వారా, ఉత్తరువులో నిర్దిష్ట పరచిన కాలావధి వరకు ఉపపరిచ్ఛేదము (1)యొక్క ఖండము (ఏ)లో నిర్వేశించిన గృహములోని జనన మరణములను గూర్చిన సమాచారమును ఆ ఖండములో నిర్దిష్ట పరచిన వ్యక్తులకు బదులు ఈ విషయమున పదాభిదానముతో రాజ్య ప్రభుత్వము నిర్దిషపరచినట్టి ఏ వ్యక్తి యైనను అందజేయ వలెనని లేక అందజేయునట్లు చేయవలెనని కోరవచ్చును.

9. ఒక ప్లాంటేషనులోని జనన మరణముల విషయములో, 8వ పరిచ్ఛేదములో నిర్దేశించిన సమాచారమును ఆ ప్లాంటేషను అధీక్షకుడు రిజిస్ట్రారుకు అందజేయవలెను లేక అందజేయునట్లు చేయవలెను: -

అయితే, 8వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (1)లోని (ఏ) నుండి (ఎఫ్) వరకుగల ఖండములలో నిర్దేశించిన వ్యక్తులు, ఆవశ్యకమైన వివరములను ఆ ప్లాంటేషను అధీక్ష కునికి అందజేయవలెను.

విశదీకరణ: - ఈ పరిచ్ఛేదములో 'ప్లాంటేషను' అను. పదమునకు, తేయాకు, కాఫీ, మిరియాలు, రబ్బరు , ఏలకులు, సింకోనా లేక రాజ్య ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా నిర్దిష్ట పరచునట్టి ఇతర పదార్దములను పండించు టకు తయారు చేయబడుచున్నట్టి లేక వాస్తవముగా పండించబడు చున్నట్టి నాలుగు హెక్టార్లకు తక్కువకాని విస్తీర్ణముగల ఏదేని భూమి అని అర్ధము; మరియు