పుట:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

3 /6-455 జిల్లా, రిజిస్ట్రారు యొక్క కృత్యములలో ఆయన నిర్వహించవలసినదిగా ప్రాధికారమిచ్చు నట్టి కృత్యములను అదనపు జిల్లా రిజిస్ట్రార్లు నిర్వహించవలెను.

(2) ముఖ్య రిజిస్ట్రారు యొక్క ఆదేశములకు లోబడి జిల్లా రిజిస్ట్రారు, ఆ జిల్లాలో జనన మరణముల రిజిస్ట్రీకరణను అధీక్షించవలెను మరియు ఈ చట్టముయొక్క నిబంధనలను, ఈ చట్టము నిమిత్తము ఆయా సమయములలో ముఖ్య రిజిస్ట్రారు జారీచేయు ఉత్తరువులను, అమలుపరచుటకు ఉత్తరదాయి అగును.

7. (1) ఒక " పురపాలిక, పంచాయితీ, లేక ఇతర స్థానిక ప్రాధికార సంస్థ యొక్క అధికారితలోని ప్రాంతము లేక ఏదైన ఇతర ప్రాంతము, లేక అట్టి ఏవ్వెన రెండు లేదా అంతకెక్కువ ప్రాంతములు చేరియున్న ప్రతియొక స్థానిక ప్రాంతమునకు రాజ్యప్రభుత్వము ఒక రిజిస్ట్రారును నియమించవచ్చును:

అయితే, ఒక పురపాలిక, పంచాయితీ లేక ఇతర స్థానిక ప్రాధికార సంస్థ విషయములో దాని అధికారినెవరినై నను లేక ఇతర ఉద్యోగినెవరినైనను రాజ్య ప్రభుత్వము రిజిస్ట్రారుగా నియమించవచ్చును.

(2) ప్రతి రిజిస్ట్రారు, 8వ పరిచ్ఛేదము లేక 9వ పరిచ్ఛేదము క్రింద తనకు ఈయబడిన సకల 'సమాచారమును అందు నిమిత్తము నిర్వహించెడి రిజిస్టరులో, ఫీజుగాని, పారితోషికముగాని తీసుకొనకుండ, నమోదు చేయవలెను. మరియు తన అధికారితలో సంభవించునట్టి ప్రతి జననమును గూర్చియు ప్రతి మరణమును గూర్చియు జాగ్రత్తగా తెలిసికొనుటకును రిజిస్టరు చేయవలసిన వివరములను కనుగొని రిజిస్టరు చేయుటకును చర్యలు తీసికొనవలెను.

(3) ప్రతి రిజిస్ట్రారుకు, అతనిని నియమించిన స్థానిక ప్రాంతమునందు ఒక కార్యాలయము ఉండవలెను.

(4) ప్రతి రిజిస్ట్రారు, ముఖ్య రిజిస్ట్రారు ఆదేశించునట్టి దినములలోను ,అట్టి వేళలందును తన కార్యాలయములో జనన మరణములను రిజిస్టరు చేయు నిమిత్తము హాజరై యుండవలెను మరియు తాను ఏ స్థానిక ప్రాంతమునకు నియమితుడైనాడో ఆ స్థానిక ప్రాంతమునకు జనన మరణముల రిజిస్ట్రారు అను పదములు చేర్చి తన పేరు, తాను హాజరై యుండు దినములు మరియు వేళలు , స్థానిక భాషలో వ్రాయబడియుండు ఒక ఫలకమును తన కార్యాలయము యొక్క బాహ్య ద్వారముపై లేక దాని దగ్గరగా స్పష్టముగా కనుపించు ఒక స్థానము నందు పెట్టించ వలెను.

(5) రిజిస్ట్రారు , ముఖ్య రిజిస్ట్రారు యొక్క పూర్వామోదముతో, సబ్ రిజిస్ట్రార్లను నియమింపవచ్చును మరియు తన అధికారితలోని నిర్దిష్ట ప్రాంతములకు సంబంధించి తన అధికారములు మరియు కర్తవ్యములలో దేనినై ననుగాని అన్నింటిని గాని వారికి అప్పగించవచ్చును .

అధ్యాయము 3

జనన మరణముల రిజిస్ట్రీకరణ.

8. (1) 16వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వము విహితపరచిన ప్రరూపములో నమోదు చేయవలసినట్టి అనేక వివరములను గూర్చి తమకు తెలిసినంతవరకు, తాను విశ్వసించుచున్నమేరకు సమాచారమును వాగ్రూపమునగాని వ్రాతమూలకమునగాని విహితపరచినట్టి కాలావధిలో రిజిస్ట్రారుకు అందజేయుట లేక అందజేయు నట్లు చూచుట ఈ క్రింద నిర్దిష్టపరచిన వ్యక్తుల కరవ్యమై, యుండును: -