పుట:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 /G-454


(2) ఏదేని ప్రాంతములో అమలులో లేని ఏదేని శాసనమును గూర్చి ఈ చట్టములోని నిర్దేశమేదైనను, ఆ ప్రాంతములో తత్సమానమైన శాసనము ఏదేని అమలునందున్నయెడల ఆ శాసనమును గూర్చిన నిర్వేశముగా అన్వయించబడవలెను.

అధ్యాయము 2.

రిజిస్ట్రీ కరణ-సిబ్బంది.

3. (1) కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా భారత రిజిస్ట్రారు-జనరలు అనబడు ఒక వ్యక్తిని నియమించవచ్చును.

(2) ఈ చట్టము కింద రిజిస్ట్రారు-జనరలు యొక్క కృత్యములలో, ఆయా సమయములలో నిర్వహించవలసినదిగా ఆయన ప్రాధికారమిచ్చునట్టి కృత్యములను ఆయన అధీక్షణాదేశముల క్రింద నిర్వహించు నిమిత్తము కేంద్ర ప్రభుత్వము తాను సబబని తలచు నట్టి పదా థిదానములతో ఇతర అధికారులను కూడ నియమించవచ్చును.

(3) రిజిస్ట్రారు-జనరలు ఈ చట్టము విస్తరించు నట్టి రాజ్యక్షేత్రములలో జనన మరణముల రిజిస్ట్రీకరణ గురించి సాధారణ ఆదేశములు జారీచేయవచ్చును. మరియు ముఖ్య రిజిస్ట్రార్‌ కార్యకలాపములను జనన మరణముల రిజిస్ట్రీకరణ విషయములో సమన్వయ పరచుటకును, ఏకీకరించుటకును చర్యలు తీసికొనవలెను. మరియు సదరు రాజ్యక్షేత్రములలో ఈ చట్టము అమలు అగు తీరును గురించి వార్షిక రిపోర్టును కేంద్ర ప్రభుత్వమునకు సమర్పించవలెను.

4. (1) రాజ్య ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా రాజ్యము కొరకు ఒక ముఖ్య రిజిస్ట్రారును నియమించవచ్చును.

(2) ముఖ్య రిజిస్ట్రారు కృత్యములలో ఆయన ఆయా సమయములలో నిర్వహించవలసినదిగా ప్రాధికారమిచ్చునట్టి కృత్యములను ఆయన అధీక్షణాదేశముల క్రింద నిర్వహించు నిమిత్తము రాజ్య ప్రభుత్వము తాను సబబని తలచు నట్టి పదాభి దానములతో ఇతర అధికారులను కూడ నియమించవచ్చును.

(3) రాజ్య ప్రభుత్వము ఏవైన ఆదేశములు ఇచ్చినయెడల వాటికి లోబడి, ఈ చట్టము యొక్క నిబంధనలను, వాటి క్రింద చేయబడిన నియమములను , ఉత్తరువులను అమలుపరచుటకు ముఖ్య రిజిస్ట్రారు రాజ్యములో ముఖ్య కార్యపాలక ప్రాధికారియై, యుండును.

(4) సమర్దమైన రిజిస్ట్రీ కరణ పద్దతిని సమకూర్చుటకుగాను యధోచిత అనుదేశములను జారీచేయుట ద్వారా కాని, అన్యధా కాని, 'రాజ్యములో రిజిస్ట్రీకరణ పనిని సమన్వయ పరచుటకును, ఏకీకరించుటకును మరియు పర్యవేక్షించుటకును ముఖ్య రిజిస్ట్రారు చర్యలు తీసుకొనవలెను మరియు 19వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2)లో నిర్దేశించిన గణాంక రిపోర్టుతొ పాటు రాజ్యములో ఈ చట్టము పనిచేయు తీరును గూర్చిన రిపోర్టును విహితపరచునట్టి రీతిగాను అట్టి అంతరావధులతోను రాజ్య ప్రభుత్వమునకు సమర్పించవలెను.

5. రాజ్య ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా, రాజ్యములోని రాజ్యక్షేత్రమును తాను సబబని తలచునట్టి రిజిస్ట్రీ కరణ డివిజనులుగా విభజించవచ్చును మరియు వేరు వేరు రిజిస్ట్రీ కరణ డివిజనులకు వేరు వేరు నియమములను విహితపరచ వచ్చును.

6. (1) రాజ్య ప్రభుత్వము , ఒక్కొక్క రెవెన్యూ జిల్లాకు ఒక జిల్లా రిజిస్ట్రారును మరియు తాను సబబని తలచునంత మంది అదనపు జిల్లా రిజిస్ట్రార్లనునియమించవచ్చును . జిల్లా రిజిస్ట్రారు యొక్క సాధారణ నియంత్రణాదేశములకు లోబడి,