పుట:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

6 /6-458 (2) అది సంభవించిన ముప్పది దినముల తరువాతను ఒక సంవత్సరము లోపలను రిజిస్ట్రారుకు తెలియపరచినట్టి, ఏదేని జననము లేక మరణమును, విహిత ప్రాధికారియొక్క వ్రాతమూలక అనుజ్ఞ తో మాత్రమే, మరియు విహిత ఫీజు చెల్లించి , ఒక నోటరీ పబ్లికు సమక్షమున లేక రాజ్య ప్రభుత్వముచే ఈ విషయమున ప్రాధికృతుడైన ఎవరేని ఇతర అధికారి సమక్షమున చేయబడిన అఫిడవిటు దాఖలు చేసిన మీదట మాత్రమే రిజిస్టరు చేయవలెను.

(3) అది సంభవించిన ఒక సంవత్సరము లోపల రిజిస్టరు చేయనట్టి ఏదేని జననము లేక మరణమును దాని యదార్దతను సరిచూచిన పిమ్మట , విహిత ఫీజు చెల్లించబడిన మీదట, మొదటి తరగతి మేజిస్ట్రేటుగాని, ప్రెసిడెన్సి మేజిస్ట్రేటు గాని చేసిన ఉత్తరువుపై మాత్రమే రిజిస్టరు చేయవలెను

(4) ఏ వ్యక్తి పైనైనను, అతడు ఏదేని జననము లేక మరణమును అందుకై నిర్దిష్టపరచిన సమయము లొపల రిజిస్టరు చేయకున్నందులకు తీసికొనదగు ఏదేని చర్యకు ఈ పరిచ్ఛేదము యొక్క నిబంధనలు భంగము కలిగించవు మరియు అట్టి ఏదేని చర్య జరుగుచుండగా అట్టి జననము లేక మరణమును రిజిస్టరు చేయవచ్చును.

14. ఎవరేని శిశువు యొక్క జననమును పేరు లేకుండ రిజిస్టరు చేసినచో, ఆ శిశువు యొక్క తల్లి లేక తండ్రి లేక సంరక్షకుడు, విహిత కాలావధి లోపల ఆ శిశువు పేరును వాగ్రూపమునగాని, వ్రాతమూలకమునగాని రిజిస్ట్రారుకు తెలియజేయవలెను, మరియు అటుపై, రిజిస్ట్రారు అట్టి పేరును రిజిస్టరులో నమోదుచేసి, పొడి సంతకము పెట్టి ఆ నమోదు తేదీ వేయవలెను.

15. ఈ చట్టము కింద రిజిస్ట్రారు ఉంచు ఏదేని రిజిస్టరులో జననమును లేక మరణమును గూర్చిన, ఏదైన నమోదు, ప్రరూపములోగాని, సారత: గాని, తప్పుగా ఉన్నదని లేక కపటపూర్వకముగా గాని అనుచితముగాగాని చేయబడినదని రిజిస్ట్రారుకు నమ్మకము కలుగునట్లు రుజువుపరచినయెడల, అతడు అట్టి నమోదులను ఏ షరతులపై మరియు ఏ పరిస్తితులలొ సరిచేయవచ్చునో లేక రద్దు చేయవచ్చునో అను దానిని గూర్చి రాజ్య ప్రభుత్వము చేయునట్టి నియమములకు లోబడి, మూల నమోదులో ఎట్టి మార్పు చేయకుండ మార్జినులొ యధోచిత నమోదు ద్వారా ఆ తప్పును సరిచేయ వచ్చును, లేక ఆ నమోదును రద్దుచేయవచ్చును. మరియు ఆ మార్జినులొని నమోదుప్రక్క సంతకము చేసి, సరిచేసిన లేక రద్దు చేసిన తేదీని ఆ సంతకమునకు చేర్చవలెను.

అధ్యాయము 4.

రికార్డుల మరియు గణాంకముల నిర్వహణ

16. (1) ప్రతి రిజిస్ట్రారు తాను అధికారితను వినియోగించుచున్నట్టి రిజిస్ట్రీకరణ ప్రాంతమునకు లేక అందలి ఏదేని భాగమునకు ఒక జనన మరణముల రిజిస్టరును విహిత ప్రరూపములో ఉంచవలెను.

(2) ఆయా సమయములందు విహితపరచినట్టి ప్రరూపములను, అనుదేశము లను అనుసరించి జనన మరణములను నమోదుచేయుట కొరకు చాలినన్ని రిజిస్టరు పుస్తకములను ముఖ్య రిజిస్ట్రారు ముద్రింపచేసి సరఫరా చేయించవలెను, మరియు స్తానిక భాషలో అట్టి ప్రరూపముల ప్రతి నొకదానిని ప్రతి రిజిస్ట్రారు కార్యాలయముయొక్క బాహ్య ద్వారముపై గాని దాని దగ్గరగా గాని బాగుగా కనపడు ఏదేని స్థలములొ ప్రదర్శించవలెను.

17. (1) ఫీజు మరియు తపాల చార్జీ చెల్లింపునకు సంబంధించిన నియమము లతో సహా రాజ్య ప్రభుత్వము ఈ విషయమున చేసిన ఏవేని నియమములకు లోబడి, ఏ వ్యక్తియై నను -