పుట:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

7 /6-459 (ఏ) జనన మరణముల రిజిస్టరులొని ఏదేని నమోదు కొరకు రిజిస్ట్రారుచే సోదా చేయించవచ్చును; మరియు

(బీ) అట్టి రిజిస్టరు నుండి ఏదేని జననము లేక మరణమునకు సంబంధించిన ఉదాహృతిని పొందవచ్చును.

అయితే, ఏదేని మరణమునకు సంబంధించి ఏ వ్యక్తి కైనను జారీచేసినట్టి ఏదేని ఉదాహృతిలో, ఆ రిజిస్టరులో నమోదు చేసిన, మరణ కారణమును గూర్చిన వివరములను వెల్లడించకూడదు.

(2) ఈ పరిచ్ఛేదము క్రింద ఇచ్చిన అన్ని ఉదాహృతులను రిజిస్ట్రారుగాని, భారత సాక్ష్య చట్టము, 1872 యొక్క 76వ పరిచ్ఛేదములోని నిబంధనల ప్రకారము ఉదాహృతులను ఇచ్చుటకు రాజ్య ప్రభుత్వముచే ప్రాధికృతుడై నట్టి ఎవరేని ఇతర అధికారిగాని, ధ్రువపరచవలెను మరియు వాటిని ఆ నమోదు దేనికి సంబంధించినదో, ఆ జననమును లేక మరణమును రుజువుపరచు నిమిత్తము సాక్ష్యముగా స్వీకారయోగ్య మ్మె నవగును.

18. జిల్లా రిజిస్ట్రారు నిర్దిష్టపరచునట్టి రీతిగా మరియు అట్టి ప్రాధికారి రిజిస్ట్రీకరణ కార్యాలయములను, తనిఖీ చేయవలెను మరియు అందు ఉంచిన రిజిస్టర్లను పరీక్షించవలెను .

19. (1) ప్రతి రిజిస్ట్రారు. తాను ఉంచిన రిజిస్టరులొని జనన మరణముల నమోదులను గురించిన వివరణి నొకదానిని, విహితపరచునట్టి అంతరావధులలోను, అట్టి ప్రరూపములలోను ముఖ్య రిజిస్ట్రారు కుగాని అతడు నిర్దిష్టపరచిన ఎవరేని అధికారికి గాని పంపవలెను.

(2) ముఖ్య రిజిస్ట్రారు, రిజిస్ట్రార్లు అందజేసిన వివరణులలోని సమాచారమును సంకలనము చేయించి, ఆ సంవత్సరములో రిజిస్టరయిన జనన మరణము లపై, ఒక గణాంక' రిపోర్టును ప్రజలందరి ఎరుకకొరకు, విహితము చేయునట్టి అంతరావధులలోను, ప్రరూపములలోను ప్రచురణ చేయవలెను.

అధ్యాయము 5.

వివిధ విషయములు

20. (1) ఈ విషయమున కేంద్ర ప్రభుత్వము చేయు నట్టి నియమములకు లోబడి, పౌరసత్వ చట్టము, 1955 కింద భారతదేశమునకు వెలుపల నున్న భారత పౌరుల జనన మరణములను భారతీయ కాన్సలేట్లలో రిజిస్టరు చేయుటకు సంబంధించి చేసిన నియమముల ననుసరించి అట్టి పౌరుల రిజిస్ట్రీకరణను గూర్చి తనకందిన, సమాచారమును రిజిస్ట్రారు-జనరలు రిజిస్టరు చేయించవలెను మరియు అట్టి ప్రతి రిజిస్ట్రీకరణను కూడ ఈ చట్టము క్రింద తగు రీతిగా చేసినట్లు భావించవలెను.

(2) భారతదేశమునకు వెలుపల జన్మించిన ఏ శిశువును గూర్చి ఉప పరిచ్ఛేదము (1)లోని నిబంధనానుసారముగా సమాచారము అందలేదో ఆ శిశువు యొక్క తల్లిదండ్రులు భారతదేశములో స్టిర నివాసమేర్పరచుకొను ఉద్దెశముతొ భారత దేశమునకు తిరిగి వచ్చినయెడల, వారు, ఆ శిశువు భారతదేశమునకు వచ్చిన తేదీ నుండి అరువది దినముల లోపల ఎప్పుడైనను, ఆ శిశువు భారతదేశమున జన్మించి యుండిన ఎట్లొ అట్లే అదే రీతిగా ఆ శిశువు యొక్క జననమును ఈ చట్టము క్రింద రిజిస్టరు చేయించవచ్చును, మరియు పైన చెప్పిన అరువది దినముల కాలావధి ముగిసిన పిమ్మట 13వ పరిచ్ఛేదపు నిబంధనలు, అట్టి శిశువు జననమునకు వర్తించును.