పుట:జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8 /G-460 ______________ 21. ఏ వ్యక్తినైనను, అతడు నివసించు వాడలో సంభవించిన ఏదేని జననమునకు లేక మరణమునకు సంబంధించి అతనికి తెలిసిన సమాచారమును అందజేయ వలసినదిగా వాగ్రూపమునగాని, వ్రాతమూలకమునగాని, రిజిస్ట్రారు కోరవచ్చును. అట్టి అభ్యర్దనను పాటించుట ఆ వ్యక్తి కి తప్పనిసరియై ఉండును.

22. ఈ చట్టము యొక్క లేక ఈ చట్టము క్రింద చేసిన ఏదేని నియమము లేక ఉత్తరువు యొక్క నిబంధనలలో వేటినైనను ఏదేని రాజ్యములో అమలు పరచుటకు ఆవశ్యకమని తోచునట్టి ఆదేశములను కేంద్ర ప్రభుత్వము ఆ రాజ్య ప్రభుత్వమునకు ఈయవచ్చును.

23 (1) ఈ క్రింది వ్యక్తి ఎవరైనను, అనగా-

(ఏ) 8వ మరియు 9వ పరిచ్ఛేదముల నిబంధనలలో దేని క్రిందనై నను ఏదైన సమాచారమును అందజేయుట తన కర్తవ్యమై యుండి యుక్తమైన కారణములు లేకుండ అందజేయకుండు వ్యక్తి లేక;

బీ) తెలుసుకొని రిజిస్టరు చేయించవలసిన వివరములలో అసత్యమై నదని తనకు తెలిసియున్నట్టి , లేక అసత్యమైనదని తాను విశ్వసించుచున్నట్టి ఏదేని సమాచారమును జనన, మరణముల రిజిస్టరులో చేర్చు నిమిత్తమై 'అందజేయు లేక అందజేయించు వ్యక్తి; లేక

(సీ) 11వ పరిచ్ఛేదము ద్వారా కోరినట్లు రిజిస్టరులొ తన పేరు, వివరణ , నివాస స్థలము వ్రాయుటకు లేక తన బొటన వేలిముద్ర వేయుటకు నిరాకరించు వ్యక్తి,

ఏబది రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపదగియుండును.

(2) తన అధికారితా క్షేత్రమందు సంభవించు ఏదేని జననమునుగాని, మరణమునుగాని యుక్తమైన కారణము లేకుండా రిజిస్టరు చేయుటను లేక 19వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (1) ద్వారా కోరినట్టి ఏవేని వివరణులను సమర్పించుటను ఉపేక్షించు లేదా అట్లు రిజిస్టరు చేయుటకు లేక సమర్పించుటకు నిరాకరించు ఏ రిజిస్ట్రారైనను లేక సబ్-రిజిస్ట్రారైనను ఏబది రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపదగియుండును.

(3) 10వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (3) క్రింద ఒక ధ్రువపత్రమును జారీచేయుటను ఉపేక్షించు లేక జారీచేయుటకు నిరాకరించు ఏ వైద్యవృత్తిదారైనను మరియు అట్టి ధ్రువపత్రమును అందించుటను ఉపేక్షించు లేక అందించుటకు నిరాకరించు ఏ వ్యక్తియైనను ఏబది రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపదగి యుండును.

(4) ఈ చట్టములోని ఏదేని నిబంధన యొక్క ఉల్లంఘనకు ఈ పరిచ్ఛేదములో ఏ శాస్తియు లేనిచో, ఆ నిబంధనను యుక్తమ్మెన కారణము లేకుండ ఉల్లంఘించు ఏ వ్యక్తి యైనను పది రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపదగియుండును.

(5) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1898లో " ఏమియున్నప్పటికిని, ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధమును మేజిస్ట్రేటు సంక్షిప్తముగా విచారణ జరుపవలెను.

24. (1) విహితపరచు నట్టి షరతులకు లోబడి, ముఖ్య రిజిస్ట్రారు, ఈ విషయమున ఒక సాధారణ లేక ప్రత్యేక ఉత్తరువు ద్వారా ప్రాధికారమొసగినట్టి ఏ అధికారియైనను , ఈ చట్టము క్రింద అపరాధము చేసిన లేక చేసినట్లు యుక్తముగా అనుమానించిన వ్యక్తి నుండి, అట్టి అపరాధమును రాజీచేయుచు ఏబది రూపాయలకు