పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలలో దాదాపు దాశాబ్దంపాటు చురుగ్గా పాల్గొన్న ఆయనకు 1941లో ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ అధినేత సుభాష్‌ చంద్ర బోస్‌ పరిచయ మయ్యారు. ఆ పరిచయంతో నేతాజీ వ్యక్తిగత సిబ్బందిలో ఆయన ఒకరై పోయారు. 1942 నుండి రండు సంవత్సరాలపాటు నేతాజీ కార్యదర్శిగా పలుదేశాలు చుట్టివచ్చారు. 1943 ఫిబ్రవరి 8న నేతాజీ సాగించిన సాహస జలాంతర్గామి ప్రయాణంలో అబిద్‌ ఆయన వెంట ఉన్నారు. మూడు మాసాల ఈ ప్రయాణం సందర్భంగా నేతాజీ తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమం వివరాలను సుభాష్‌ చంద్రబోస్‌ వివరిస్తుండగా అబిద్‌ హసన్‌ ఆ వివరాల నోట్సు నమోఫదు చేశారు.

ఆ సమయంలో భారతీయులందరికి స్పూరిదాయకంగా నిలచిన 'జైహంద్‌' నినాదం, సుభాస్‌ చంద్రబోస్‌ పేరును కూడా మర్చిపోయేలా చేసిన 'నేతాజీ' అను పదాన్ని అబిద్‌ హసన్‌ సఫ్రాని సృష్టించారు. భారత జాతీయ సైన్యంలో మొక్కవోని దీక్షతో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన గాంధీ బ్రిగేడ్‌ కమాండర్‌గా నియమితులయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాల ఫలితంగా ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైన్యాధికారుల్లాగే ఆయన కూడా రెండు సంవత్సరాలు జైలులో ఉండాల్సి వచ్చింది.

1947లో స్వాతంత్య్ర లభించాక భారతదేశం రెండుగా చీలిపోవటం, పోరాట యోధుడైన సఫ్రానికి బాధా కలిగించింది. అంతర్జాతీయంగా నేతాజీతో కలసి ఆయన జరిపిన పర్యటనలు, ఆ సందర్భంగా గడించిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర భారత ప్రధాని జవహర్‌ లాల్‌ స్వయంగా అబిద్‌ను ఇంటర్యూ చేసి ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసులో బాధ్య తాయుతమైన పదవులు అప్పగించారు. అబిద్‌ హసన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖలో బాధ్యతలను నిర్వహిస్తూ, పెకింగ్, కైరోలలో భారత ప్రబుత్వ ప్రప్రదమ కార్యదర్శిగా, డెమాస్కస్‌, బాగ్దాద్‌, డెన్మార్క్‌లలో కౌన్సల్‌-జనరల్‌ గా పనిచేశారు.

స్వతంత్ర భారతంలో అత్యున్నత పదవులను నిర్వహించి, మాతృభూమి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన అదృష్టాన్నిఅబిద్‌ హసన్‌ దక్కించుకున్నారు. అత్యున్నత స్థాయి పదవుల నిర్వహణ నుండి విశ్రాంతి పొందిన తరువాత అబిద్‌ హసన్‌ తిరిగి హెదారాబాద్‌ చేరుకున్నారు. అప్పటి నుండి సేవా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పలువురికి మార్గదర్శకులయ్యారు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అపూర్వం అనదగిన 'జైహింద్‌', 'నేతాజీ' లాంటినినాదాలను, పదాలను సృష్టించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధులు ఆబిద్‌ హసన్‌ సఫ్రాని 1984లో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌