పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

203

93. బీబి అముతుస్సలాం

(1907-1985)

పరాయి పాలకుల బానిసత్వం నుండి స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు గాంధేయ మార్గం ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి జీవితచరమాంకం వరకు మహాత్ముని మార్గంలో సాగిన స్వాతంత్య్ర సమరయోధులలో ప్రముఖులు బీబి అమతుస్సలాం.

1907లో బీబి అమతుస్సలాం పాటియాలా రాజపుఠాణా పరివారంలో జన్మించారు. తల్లి పేరు అమతుర్రెహమాన్‌. తండ్రి కల్నల్‌ అబ్దుల్‌ హమీద్‌. ఆరుగురు అన్నదమ్ములకు చెల్లెలిగా పెరిగిన అమతుస్సలాం చిన్ననాటి నుండి ఆరోగ్యపరంగా బలహీనురాలు.

చిన్నతనంలోనే పెద్దన్న ముహమ్మద్‌ అబ్దుర్రషీద్‌ ఖాన్‌ ప్రభావం వలన ప్రజాసేవ చేయాలన్న నిరయానికొచ్చారు.అన్న మార్గదర్శ కత్వంలో ఖద్దరు ధరించడం, విక్రయించడం మాత్రమే కాకుండా సబలు సమావేశాలకు హాజరైన ఆమె మహాత్ముని అహింసా సిద్ధాంతం, కార్యాచరణ పట్ల ఆకర్షితు రాలై 1931లో అతి ప్రయాసతో గాంధీజీ నిర్వహిస్తున్నసేవాగ్రాం చేరారు. ఆశ్రమం నిర్ధేశించిన కఠిన నియమనిబంధనలను పాటిస్తూ, అంకితభావంతో బాధ్యాతలు నిర్వహిస్తూ గాంధీజీ దంపతులకు ప్రియ పుత్రిక అయ్యారు.

జాతీయోద్యమంలో భాగంగా 1922లో మహాత్ముని అనుమతితో అనారోగ్యాన్ని లెక్కచేయక ఆశ్రమంలోని ఇతర మహిళలతోపాటు ఆమె జైలు కెళ్ళారు. జైలు నుండి

చిరస్మరణీయులు