పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

201

92. అబిద్‌ హసన్‌ సఫ్రాని

(1911-1984)

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధులుగా మాతృభూమి విముక్తి కోసం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో ప్రాణత్యాగాలకు సిదమై ఆయుధాలు చేతబట్టి యుద్దరంగానికి సాగిన యోధులలో ముఖ్యులు అబిద్‌ హసన్‌ సఫ్రాని.

భాగ్యనగరంగా చరిత్ర ఖ్యాతినార్జించిన హైదారాబాదులో అబిద్‌ హసన్‌ సఫ్రాని 1911 ఏప్రిల్‌ 11న జన్మించారు. తండ్రి అమీర్‌ హసన్‌. తల్లి ఫక్రుల్‌ హాజియా బేగం. ఆమె ఇరాన్‌కు చెందిన మహిళ. విలక్షణ వ్యక్తిత్వం గల ఆమె ఖిలాఫత్‌- సహాయ నిరాకరణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు.

ఆ తల్లి వారసత్వంగా అబిద్‌ జాతీయోద్యమ జెండాను చేతపట్టారు . సహాయ నిరాకరణ

ఉద్యమంలో భాగంగా కళాశాల చదువుకు స్వస్తిచెప్పి 1931లో సబర్మతి ఆశ్రమం

చేరుకున్నారు. అక్కడ కొంతకాలం గడిపిన తరువాత వలస పాలకుల తరిమి వేతకు సాయధ పోరాటమే సరైన మార్గమనుకున్నారు. ఈమేరకు నాసిక్‌ జైలుకు చెందిన రిఫైనరీని నాశనం చేయ సంకల్పించిన విప్లవకారుల దళంతో కలసి పనిచేశారు. ఆ కారణంగా ఏడదిపాటు కారాగార శిక్షకు గురయ్యారు. ఆ శిక్షాకాలం పూర్తికాక ముందే 'గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక' ఫలితంగా ఆయన విడుదలయ్యారు.

చిరస్మరణీయులు