పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

ప్రవేశించి ఉదృతంగా ఉద్యమ ప్రచారం గావించిన ఫలితంగా అరెస్టయ్యారు. జాతీయ కాంగ్రెస్‌లో పలు పదవులు చేపట్టడమే కాకుండా పోరాట కార్యక్రమాలలో క్రియాశీలకంగా వ్యవహరించటంతో ఆయన పలుమార్లు జైలుశిక్షలను అనుభవించారు.

1935 భారత ప్రభుత్వమ్ చట్టం ప్రకారంగా 1937లో జరిగిన ఎన్నికలు ఆయన దక్షిణ చంపారన్‌ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. జాతీయ కాంగ్రెస్‌లో అత్యున్నతస్థానంలో ఉన్న ప్రజానాయకుడు సయ్యద్‌ మహమ్మద్‌ ముఖ్యమంత్రిగా పదవికి అన్నివిధాల సమర్ధుడన్న అభిప్రాయం ఆనాడు బలంగా వ్యక్తమైం ది. డాకర్‌ రాజేంద్రాప్రసాద్‌ అడ్డు తగలడంతో ముఖ్యమంత్రయ్యే అవకాశాన్నిఆయన కోల్పోయారు.

1946లో బీహార్‌ లెజిసేవ్‌ అసెంబ్లీకి మరోసారి ఎన్నికయ్యారు. సిహా ప్రబుత్వం లో రవాణా, పరిశ్రమలు, వ్యవసాయ శాఖల మంత్రిగా బాధ్యాతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. సోషలిస్ట్‌ భావాలు గల ఆయన తన హయాంలో చిన్నకుటీర పరిశ్రమల స్థాపనకు శ్రమించారు. సహకార వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు సహకరించారు. ఆదాయ పంపిణీలో తేడాలు ఉన్నంత వరకు, ప్రజలు అంతరాలను అనుభవిస్తున్నంత వరకు సంపూర్ణ ప్రగతి ఏమాత్రం సాధ్యం కాదాని అభిప్రాయపడ్డారు.

అఖిల భారత ముస్లిం లీగ్ వేర్పాటువాద రాజకీయాలను నిరసించారు. విభజనను కోరుతున్ననేతల నైజాన్ని ఆయన బహిరంగంగా దుయ్యబ్టారు . విభజనకు ప్రయ త్నాలు శరవేగంగా జరుగుతున్నప్పుడు ప్రముఖ హిందూ-ముస్లిం నాయకుల అభీష్టాలకు వ్యతిరేకంగా, విభజన వలన కలిగే నష్టాలను వివరిస్తూ, విభజన యత్నాలను ఎదుర్కోవాల్సిందిగా ప్రజలను కోరుతూ ఆయన పర్యటనలు జరిపారు. విభజన వలన అటుగాని-ఇటుగాని ప్రధానంగా ముస్లింలు నష్టపోతారని ఆయన హెచ్చరించారు. భారతదశం చీలిన సందర్బంగా పెచ్చరిల్లిన దురదృ షకర హింసాకాండకు బలైన హిందూ, ముస్లిం, సిక్కు సోదరు లకు పునరావాసం కల్పించేందుకు, ఆ జనసమూహాలలో ఆత్మస్తైర్యం పెంపొందిచేందుకు ఆయన ప్రత్యేకంగా కృషిసల్పారు.

స్వతంత్య్ర భారతావనిలో1952లో జరిగిన ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో తూర్పు చంపారన్‌ నుండి లోక్‌సభకు ఎన్నికై ప్రభుత్వంలో పలు పదవులను నిర్వహించారు. ప్రధానంగా మతోన్మాద రక్కసిని మట్టి కరిపించేందుకు ఎన్నికల సంస్కరణలను ఆయన సూచించారు. ఈ విధంగా జాతీయోద్యమ కాలం నుండి బహుముఖ పాత్రలు నిర్వహించి, భవ్య భారతదేశం నిర్మాణంలో కూడాభాగం పంచుకున్న డాక్టర్‌ సయ్యద్‌ మహమ్మద్‌ 1971లో ఢిల్లీలో మృతిచెందారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌